'ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకోవాలి'

కర్నూల్: ఆదోనిలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురువారం పట్టణంలో అధికారులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ మాట్లాడుతూ.. ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వెంకటలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఎంపీడీవో గీతావాణి, తదితర అధికారులు పాల్గొన్నారు.