అనంత మహిళకు రాష్ట్రస్థాయిలో చోటు
ATP: రూరల్ మండలానికి చెందిన రావూరి లక్ష్మీదేవి ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్‌గా నియమితులయ్యారు. నియామకానికి కృషిచేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. కష్టపడిన మహిళా కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వడం పట్ల ఆమె సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.