నక్కపల్లిలో హోంమంత్రి అనిత ప్రజాదర్బార్
AKP: హోం మంత్రి వంగలపూడి అనిత బుధవారం నక్కపల్లి సమీపంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. మొత్తం 150 దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు,మహిళలతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రెవెన్యూ, వ్యవసాయం, విద్యుత్, భూ సర్వేలు,రేషన్ కార్డులు,ఇళ్ల స్థలాలకు సంబంధించిన అర్జీలు పెద్ద సంఖ్యలో వచ్చాయని మంత్రి అన్నారు.