టీడీపీ పేరును ఇంగ్లిష్ దేశంగా మార్చుకోండి: తులసిరెడ్డి
KDP: టీడీపీ పేరును 'ఇంగ్లిష్ దేశం' లేదా 'ఆంగ్ల దేశం పార్టీ'గా మార్చుకోవాలని మాజీ ఎంపీ తులసి రెడ్డి విమర్శించారు. ఆదివారం వేంపల్లెలో ఆయన మాట్లాడారు. 1982 మార్చి 29న స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు భాష, తెలుగు జాతి ఆత్మగౌరవ పరిరక్షణ కోసం టీడీపీని స్థాపించారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పాలనలో తెలుగు భాష పరిస్థితి దిగజారిందని విమర్శించారు.