'అసాంఘిక కార్యకలాపాలు చేపడితే కఠిన చర్యలు'

ప్రకాశం: కనిగిరిలోని పలు లాడ్జిల్లో SI మాధవరావు సోమవారం అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాడ్జిల్లో బస చేసిన వ్యక్తుల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనుమానిత వ్యక్తులు లాడ్జిల్లో బసచేస్తే ఆ సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలపాలని SI సూచించారు. లాడ్జిల్లో అసాంఘిక కార్యకలాపాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.