గుడివాడలో అన్నదాత పోరు కార్యక్రమం

గుడివాడలో అన్నదాత పోరు కార్యక్రమం

కృష్ణా: గుడివాడ ఆర్డీవో కార్యాలయం వద్ద వైసీపీ నేతలు అన్నదాత పోరు కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ఆరుగాలం శ్రమించి పట్టెడన్నం పెట్టే రైతులకు ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన ఎరువుల కోసం గంటల తరబడి క్యూలైన్‌లో రైతులు ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం తక్షణమే ఎరువుల కొరత తీర్చాలని డిమాండ్ చేశారు.