అల్లర్లు సృష్టిస్తే ఉపేక్షించేది లేదు

గుంటూరు: శావల్యపురం మండలం కారుమంచి గ్రామంలో రూరల్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. అనంతరం సీఐ గ్రామస్తులతో మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అల్లర్లు చేసిన, ప్రోత్సహించిన ఉపేక్షించేది లేదన్నారు. రాజకీయ అల్లర్లకు పాల్పడి యువత భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.