VIDEO: గ్రామ సభలో ఉద్రిక్తత.. కర్రలతో దాడులు
SRPT: కోదాడ మండలం అడ్లూరు కాలనీ గ్రామసభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ నిధులు దుర్వినియోగం చేశారని ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యులను గ్రామ సభలో ప్రశ్నించడంతో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. కర్రలతో గ్రామస్థులు కొట్టుకున్నారు. దాడిలో పలువురికి గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పలువురిని కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.