రోడ్డు ప్రమాదంలో హోంగార్డుకు గాయాలు
బాపట్లలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యలంక రహదారిపై బైక్‌పై ప్రయాణిస్తున్న హోంగార్డు సురేష్‌ను గుర్తు తెలియని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయనకు గాయాలు అయ్యాయి. స్థానికులు ఆయనను బాపట్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. హోంగార్డు విభాగానికి చెందిన ఏఎస్‌ఐ శ్రీకాంత్ ఆస్పత్రికి చేరుకుని సురేష్‌ను పరామర్శించి తక్షణ సాయాన్ని అందజేశారు.