'ఈనెల 20న మొక్కలు నాటాలి'

'ఈనెల 20న మొక్కలు నాటాలి'

AKP: కోటవురట్ల మండలంలో ఈనెల 20వ తేదీన 1,600 మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంపీడీవో చంద్రశేఖర్, ఏపీవో నాగరాజు తెలిపారు. బుధవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. గృహాలు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు లక్ష్యం మేరకు పని దినాలు కల్పించాలని సూచించారు.