ట్రేని IAS బస ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
BHPL: పలిమెల మండలం లెంకలగడ్డ ప్రాథమిక పాఠశాలలో ఈ నెల 8 నుంచి 15 వరకు ముస్సోరి నుంచి వచ్చే శిక్షణా ఐఏఎస్ అధికారుల బృందం బస చేయనుంది. ఈ క్రమంలో గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్వయంగా ఏర్పాట్లు పరిశీలించారు. పాఠశాల భవనం, వసతి సౌకర్యాలు, విద్యుత్, తాగునీరు, పారిశుధ్య కార్యక్రమాలు, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.