నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు

నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఖాడ్మండూ మేయర్ బాలెన్ షా తెలిపారు. నిరసనకారులు దయచేసి కాస్త ఓపిక పట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటవుతుందని తెలిపారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికలు కూడా జరుగుతాయని వెల్లడించారు. కాగా, నేపాల్ ఆందోళనల్లో ఇప్పటివరకు 25 మంది ప్రాణాలు కోల్పోగా.. 600 మందికి పైగా గాయపడ్డారు.