ఏప్రిల్ 1 నుంచి ఉపాధి హామీ పనులు ప్రారంభం

ఏప్రిల్ 1 నుంచి ఉపాధి హామీ పనులు ప్రారంభం

PLD: మాచవరం మండలం గంగిరెడ్డిపాలెం సచివాలయంలో ఉపాధి హామీ పనులపై అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీవో కోటిరెడ్డి మాట్లాడుతూ.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. పనులకు వచ్చే ప్రతి కూలీకి జాబ్ కార్డు తప్పనిసరి అని, అలాగే పోస్టాఫీసుల్లో ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను తక్షణమే పూర్తి చేసుకోవాలని సూచించారు.