డాక్టర్లపై భౌతిక దాడులు జరగడం దురదృష్టకరం: పర్ణిక రెడ్డి

NRPT: సమాజ సేవలో డాక్టర్ల ఎంతో కీలక పాత్ర పోషిస్తూ ప్రజల ఆరోగ్యం కాపాడుతున్నారని, అలాంటి డాక్టర్లపై కొందరు భౌతిక దాడులకు పాల్పడటం దురదృష్టకరమని ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి అన్నారు. ఆదివారం నారాయణపేటలోని ఓ ఫంక్షన్ హాలులో ఓ ప్రైవేట్ హాస్పిటల్, లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట వారు ఏర్పాటు చేసిన ఉచిత పిడియాట్రిక్ కార్డియాక్ స్క్రీనింగ్ శిబిరం ఆమె పాల్గొన్నారు.