VIDEO: 'అడవుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి'

VIDEO: 'అడవుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి'

MHBD: బయ్యారం(M)కేంద్రంలో శనివారం ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా DFO రమేష్ మాట్లాడుతూ.. అడవుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో అడవులు తగ్గిపోతే గాలి, నీరు, ఆహారం వంటి జీవాధారాలు కరవవుతాయని హెచ్చరించారు. కనుక ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి అడవులు పెంచాలన్నారు.