ఐదుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవం
JN: రఘునాథపల్లి మండలంలో ఐదు గ్రామాల్లో ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఐదుగురు సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పడమటిగూడెం - బాలశౌరెడ్డి, రామన్నగూడెం - వాకిటి అలివేలు, వెల్ది - సింగిరెడ్డి సునీత, సోమయ్యకుంటతండా - కెతావత్ ఈర్యానాయక్, అయ్యవారిగూడెం -పారునంది సునీతలను సర్పంచ్‌లుగా అధికారులు ఏకగ్రీవంగా ప్రకటించి ధ్రువపత్రాలు అందజేశారు.