రికార్డు సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడీ

రికార్డు సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడీ

రంగారెడ్డి: సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ భారత బ్యాడ్మింటన్ చరిత్రలో మరో రికార్డు నెలకొల్పారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో అత్యధిక కాలం (10 వారాలు) అగ్రస్థానంలో కొనసాగిన జోడీగా రికార్డు సృష్టించారు. ఇదివరకు ఈ రికార్డు సైనా నెహ్వాల్ (9 వారాలు) పేరిట ఉండేది. ఆమె ఆగస్టు 18, 2015 నుంచి అక్టోబర్ 21, 2015 వరకు నంబర్ 1గా కొనసాగారు.