నేడు ఉచిత వైద్య శిబిరం

నేడు ఉచిత వైద్య శిబిరం

W.G: అత్తిలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం మండలం మంచిలిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్షుడు శిరగాని నాగేశ్వరరావు తెలిపారు. ప్రముఖ వైద్య నిపుణులచే చిన్నపిల్లలు, మహిళల సమస్యలు, బీపీ, షుగర్, జ్వరం వంటి సమస్యలకు ఉచిత వైద్య పరీక్షలు చేసి, మందులు అందజేస్తామన్నారు. లయన్స్ క్లబ్ జిల్లా కో-ఆర్డినేటర్ విజయశ్రీ శిబిరాన్ని ప్రారంభిస్తారన్నారు