'ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు'

NRML: ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. సోమవారం ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.