VIDEO: డివైడర్‌ను ఢీకొట్టిన చెరకు లారీ
HYD: కూకట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం చెరకు లోడుతో వెళ్తున్న లారీ డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ అదుపుతప్పి పల్టీ కొట్టడంతో చెరకు రోడ్డుపై పడిపోయింది. దీనివల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు క్రేన్ సహాయంతో లారీని తొలగించి, కేసు నమోదు చేశారు.