విద్యుత్ సమస్య పరిష్కరించిన సర్పంచ్
ములుగు జిల్లా ఎటునాగారం మండలం కోయగూడ గ్రామ పంచాయతీలోని రాంనగర్‌లో నాలుగేళ్లుగా ఉన్న వీధి దీపాల సమస్యను సర్పంచ్ పోరిక సరిత ఆదివారం పరిష్కరించారు. గాలి దుమారం కారణంగా థర్డ్ వైర్ తెగిపోవడంతో వీధి దీపాలు పనిచేయడం లేదు. ఎన్నికల హామీ మేరకు విద్యుత్ అధికారులతో మాట్లాడి వైర్ ఏర్పాటు చేయించి వీధి దీపాలు వెలిగించడంతో గ్రామస్తులు సర్పంచ్‌ను అభినందించారు.