అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు

అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు

NLR: కట్నం కోసం తనను భర్తతోపాటు అత్తమామలు వేధిస్తున్నారని నెల్లూరు కోటమిట్టకు చెందిన ఆత్మకూరు సంధ్య చిన్న బజార్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసింది. తాను ఓ నర్సింగ్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నానని భర్త ఆంటోనీ ఓ ప్రైవేటు ఉద్యోగిగా ఉన్నాడని.. అదనపు కట్నం కోసం ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.