సెక్యూరిటీ గార్డుల అన్యాయంపై నిరసన
VSP: విశాఖలో సెక్యూరిటీ గార్డుల అన్యాయంపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీ సెక్యూరిటీ అండ్ హౌస్‌కీపింగ్ అసోసియేషన్ కేజీహెచ్ సెక్యూరిటీ కార్యాలయం ముందు నిరసన చేపట్టింది. వేతనాన్ని రూ.12 వేల నుంచి రూ.21 వేలుకు పెంచాలని డిమాండ్ చేశారు.