'బడిబాట'కు విశేష స్పందన
BHNG: ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ జూకంటి అనిల్ కుమార్ మరియు పదిమంది వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 'బడిబాట' కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి విశేష ఆదరణ లభించిందని సర్పంచ్ అనిల్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు లక్ష్యంగా ఈ కార్యక్రమం గ్రామంలో నిర్వహించామని తెలిపారు.