VIDEO: కారు–బైక్ ఢీ.. ద్విచక్ర వాహనదారుల దుర్మరణం
BHPL: జిల్లా రేగొండ మండల కేంద్రంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండల కేంద్రంలో శివారు జగ్గయ్యపేట వెళ్లే దారిలో మూల మలుపు వద్ద కారు-బైక్ ఢీకున్నాయి. ఈ ఘటనలో ములుగు జిల్లా శ్రీరాములపల్లికి చెందిన ద్విచక్ర వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.