'త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలి'
కృష్ణా: మచిలీపట్నంలో ప్రజలకు ప్రతిరోజు త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ బాలాజీని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ కోరారు. ప్రభుత్వాలు మారినా 15 సంవత్సరాల నుంచి మచిలీపట్నంలో రోజు వీడిచి రోజు కేవలం 30 నిమిషాలు మాత్రమే త్రాగునీరు సరఫరా చేసి, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.