పాఠశాల భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే
NGKL: బిజినపల్లి మండలం వట్టెం గ్రామంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ నిత్యానంద రెడ్డి, డైరెక్టర్ పీ. శరత్ చంద్ర రెడ్డి సహకారంతో నూతనంగా నిర్మించిన ఉన్నత పాఠశాల భవనమును ఇవాళ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు ఉత్తమ విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.