ఉసిరి చెట్టు నుంచి కల్లు..!

HNK: భీమదేవరపల్లి మండలంలోని చంటయ్యపల్లి గ్రామంలో బ్రహ్మంగారు చెప్పిన ఉసిరి చెట్టుకు కల్లు పారుతుందనే ఘటన నిజమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఉసిరి చెట్టును వింతగా చూడటం మొదలెట్టారు. రోజూ ఉదయం 9 గంటలకు చెట్టు నుంచి సుగంధ ద్రవం విడుదల అవుతుందని బ్రహ్మంగారు చెప్పిన మాటలు నిజం అయ్యాయని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.