'సత్యం ఫౌండేషన్' సేవలు ప్రశంసనీయం

'సత్యం ఫౌండేషన్' సేవలు ప్రశంసనీయం

కోనసీమ: కే. గంగవరం(మం) కోటిపల్లిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అన్నదానం, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. క్యూ లైన్‌లో నిలబడి సోమ్మసిల్లి పడిపోయిన ఓ మహిళను ఫౌండేషన్ ఛైర్మన్ సత్యం గమనించి తక్షణ వైద్యసహాయం అందేలా చేశారు.