'గురు తేజ్ పోరాటం వల్లే సనాతన ధర్మం బ్రతికి ఉంది'
ASF: కాగజ్ నగర్ పట్టణంలోని సిక్కుల గురువు గురు తేజ్ బహదూర్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా బహదూర్ చిత్రపటానికి MLA హరీష్ బాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు. MLA మాట్లాడుతూ.. గురు తేజ్ బహదూర్ చేసిన పోరాట ఫలితంగానే భారతదేశంలో సనాతన ధర్మం బ్రతికి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిక్కు మత గురువులు, పెద్దలు పాల్గొన్నారు.