రాజ్యాంగ సవరణ జరగాలి: యనమల

రాజ్యాంగ సవరణ జరగాలి: యనమల

AP: రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బలహీన వర్గాల కోసం రాజ్యాంగ సవరణ జరగాలని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని తెలిపారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని విజ్ఞప్తి చేశారు.