ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటాం: MLA

ADB: రోడ్డు ప్రమాదంలో లోతుర్య తండాకు చెందిన బాణావత్ అశ్విని,మంజుల మృతి చెందటం బాధాకరమని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం పెంబి మండలంలోని లోతుర్య తండాకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, 20వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.