VIDEO: సింగరకొండ తిరునాళ్లకు ఏర్పాట్లు చేస్తున్నాం: ఆర్డీవో
BPT: అద్దంకి మండలంలోని సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక తిరునాళ్లు వచ్చే నెల 2వ తేదీన నిర్వహించనున్నట్లు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న తెలిపారు. బుధవారం సింగరకొండలో మీడియా ఎదుట ఈ కార్యక్రమం గురించి మాట్లాడారు. తిరునాళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేస్తున్నామని చెప్పారు.