'అవసరమైనంత యూరియా బస్తాలను విక్రయించాలి'

WNP: జిల్లాలో రైతులకు అవసరమైనంత యూరియా బస్తాలను మాత్రమే విక్రయించాలని, అవసరానికి మించి అమ్మితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. రాజనగరం గ్రామంలో ఫర్టిలైజర్ షాపును తనిఖీ చేశారు. యూరియా కొరత ఏర్పడకుండా చూసుకోవాల్సిన అవసరం అధికారులపై ఉందన్నారు. ఈ విషయంపై మండల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.