కార్యకర్తల అభిప్రాయం మేరకు పదవులు కేటాయింపు

ప్రకాశం: ఎర్రగొండపాలెంలోని షీలా స్కూల్లో పుల్లలచెరువు మండల తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఎన్నికలు, పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను టీడీపీ ఇంఛార్జ్ ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో మండల స్థాయి నాయకులు సోమవారం ప్రారంభించారు. గ్రామ కమిటీలను ఏకాభిప్రాయంతో ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యకర్తల అభీష్టం మేరకు నిర్ణయాలు తీసుకున్నామని ఆయన వివరించారు.