సౌదీ రిఫైనరీ.. మరోసారి ఇరాన్ దాడి
అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇప్పటికే అనేక భవనాలు, కీలక స్థావరాలు నేలమట్టం అయ్యాయి. అయితే తాజాగా సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అరామ్‌కో రిఫైనరీపై ఇరాన్ మరోసారి డ్రోన్ దాడి చేసినట్లు తెలుస్తోంది. వరుస దాడులతో సౌదీ అరేబియాలో పరిస్థితి దారుణంగా మారింది.