'ఇంటిపై ప్రమాదకర విద్యుత్ తీగలను తొలగించండి'
KRNL: పెద్దకడబురు మండలం కలుకుంట గ్రామానికి చెందిన తెలుగు బసప్ప ఇంటిపై ఉన్న ప్రమాదకర విద్యుత్ తీగలను తొలగించాలని CPM నాయకులు తిక్కన అర్జిదారుడితో కలసి శనివారం ప్రత్యేక విద్యుత్ అదాలత్‌లో ఫిర్యాదు చేశారు. ఇంటి పైనే మెయిన్ విద్యుత్ తీగలు పోవడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. తక్షణమే అధికారులు స్పందించి విద్యుత్ తీగలను వేరే చోటుకు మార్చాలని వారు కోరారు.