మీ సేవా వాట్సాప్‌‌కు భారీ స్పందన

మీ సేవా వాట్సాప్‌‌కు భారీ స్పందన

TG: రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్‌ డిజిటల్‌ సేవల వేదిక మీ సేవా కింద ప్రారంభించిన వాట్సాప్‌ సేవను 22 రోజుల్లోనే 2.7 లక్షల సార్లు ప్రజలు ఉపయోగించారని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. NOV 18న మీ సేవా కింద అదనపు డిజిటల్‌ ఛానల్‌గా ఈ సేవను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సేవ ద్వారా ప్రజలు మీసేవా కేంద్రాలకు వెళ్లకుండానే ప్రభుత్వ సేవలు పొందగలుగుతున్నారు.