పాదచారుడిని ఢీ కొట్టిన లారీ

పాదచారుడిని ఢీ కొట్టిన లారీ

WGL: నగరంలోని ఆటోనగర్‌లో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న పాదచారుడిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మంచూరి చంద్ర చారి (50) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన 108 సిబ్బంది ఈఎంటి నాగరాజు, పైలట్ సాంబయ్య ప్రథమ చికిత్స అందించి ఆయనను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.