జూన్ 13 నుంచి విశాఖ-అబుదాబి విమాన సర్వీసులు

AP: జూన్ 13 నుంచి విశాఖ-అబుదాబి విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. వారానికి 4 రోజుల పాటు విశాఖ-అబుదాబి విమాన సర్వీసులను నడపనున్నాయి. సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో విమానం ఉ. 8.20 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఉ. 9.50 గంటలకు అబుదాబికి వెళ్తుందని అధికారులు చెప్పారు. దేశీయంగా విశాఖ- భువనేశ్వర్ మధ్య విమాన సర్వీసు నడిపేందుకు ఒడిశా ప్రభుత్వం అంగీకరించింది.