గాలి వాన బీభత్సం.. రైతులకు తీవ్ర కష్టం

గాలి వాన బీభత్సం.. రైతులకు తీవ్ర కష్టం

అన్నమయ్య: సుండుపల్లె మండలంలో కురిసిన గాలి వానతో మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వైన్‌పాలెం పంచాయతీ బాఘంపల్లె రహదారిపై చెట్టు విరిగి పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మండల వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తిమ్మసముద్రం పంచాయతీలో చెట్టు కొమ్మలు విరిగి పడడంతో రహీం అనే వ్యక్తి గాయపడ్డాడు. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.