అక్రమ మద్యం కేసులో వ్యక్తి అరెస్ట్
CTR: అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు పాలసముద్రం పోలీసులు మంగళవారం తెలిపారు. పాలసముద్రం మండలం బలిజ కండ్రిక వద్ద నిర్వహించిన తనిఖీలో అదే గ్రామానికి చెందిన గోపి అనే వ్యక్తి 19 మద్యం వాటర్ బాటిల్లు కలిగి ఉండగా అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అక్రమంగా మద్యం కలిగి ఉన్నా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.