VIDEO: జాతీయ రహదారిపై బోల్తా పడిన కోళ్ల వ్యాన్
SRPT: మునగాల మండలం ముకుందాపురం వద్ద అదుపుతప్పి లారీ బోల్తా బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ముకుందాపురం వద్ద డివైడర్‌ను లారీ ఢీ కొట్టింది. రోడ్డుపై కోళ్లు మరియు చికెన్ వెస్టేజ్ చెల్లాచెదురుగా పడిపోయాయి. విజయవాడలో చేపల చెరువులో వేసేందుకు కోళ్లు వేస్టేజ్ తీసుకెళుతున్నట్టుగా స్థానికులు తెలిపారు. వ్యాన్ బోల్తాపడడంతో రోడ్డుపై ట్రాఫిక్ జామైంది.