నేడు ఈ గ్రామాలలో విద్యుత్‌కి అంతరాయం
కాకినాడ: తాళ్లరేవు మండలం చొల్లంగి విద్యుత్తు సబ్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్తుకు అంత రాయం ఏర్పడుతోందని ఈఈ ఎన్. ఉదయ్ భాస్కర్ తెలిపారు. చొల్లంగి, చొల్లంగి పేట, పటవల, కొత్తూరు, రామన్నపాలెం, మట్లపాలెం, జి. వేమవరం ప్రాంతాల్లో విద్యుత్తు ఉండదన్నారు. వినియోగదారులు సహకారించాలని ఆయన కోరారు.