పేకాట శిబిరంపై దాడి.. నలుగురు అరెస్ట్
నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కలిగొట్ శివారులో పేకాట స్థావరంపై CCS ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో CCS సిబ్బంది మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 4 వాహనాలు, 3 సెల్ ఫోన్లు, రూ.10,940ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.