కనిగిరిలో వైభవంగా నరసింహస్వామి పల్లకి సేవ

ప్రకాశం: కనిగిరిలోని దేవాంగనగర్ సమీపంలో కొలువైన నరసింహస్వామి ఆలయంలో స్వామివారి పల్లకి సేవోత్సవం శనివారం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్నారు. స్వామిపల్లకి స్వయంగా మోసి, పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. వేద పండితులు స్వామివారి తీర్థప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు.