గురుకుల కళాశాలను పరిశీలించిన ఎమ్మెల్యే

గురుకుల కళాశాలను పరిశీలించిన ఎమ్మెల్యే

కామారెడ్డి: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యాలయంలోని విద్యార్థులతో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. కళాశాలలో ఉన్న ఇబ్బందులు ఇతర వివరాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.