'నాలుగు కొత్త విద్యుత్తు సబ్ స్టేషన్లు మంజూరు'

MBNR: జడ్చర్ల నియోజకవర్గంలో 4 కొత్త విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి శనివారం తెలిపారు. గొల్లపల్లి, జడ్చర్ల పట్టణం, రాణిపేట, ఆలూరు గ్రామాలకు మంజూరయ్యాయన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జడ్చర్ల నియోజకవర్గంలో కొత్త విద్యుత్ సబ్ స్టేషన్లు పనులు పూర్తి అయితే.. త్వరలో విద్యుత్తు కష్టాలు తీరుతాయన్నారు.