VIDEO: చికెన్, మటన్ షాప్‌ల వద్ద పెరిగిన రద్దీ
NGKL: కల్వకుర్తి పట్టణంలో ఈరోజు ఉదయం మాంసం విక్రయాలు జోరుగా సాగాయి. చికెన్, మటన్ షాపుల వద్ద తెల్లవారుజాము నుంచే కొనుగోలుదారుల రద్దీ పెరిగింది. కిలో చికెన్ ధర రూ. 300 పైచిలుకు ఉండగా, మటన్ రూ. 800కు విక్రయించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలిరావడంతో కల్వకుర్తి పట్టణం జనసందోహంతో కిక్కిరిసిపోయింది.