VIDEO: అంబాజీపేటలో రెండు రక్తపింజర్‌లు హల్‌చల్
కోనసీమ: అంబాజీపేటలో గురువారం రెండు ప్రమాదకర రక్త పింజరి పాములు హల్‌చల్ చేశాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు భీమనపల్లికి స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వర్మ చేరుకుని పాములను బంధించాడు. ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సర కాలంలో ఈ జాతికి చెందిన పాములు కరవడం వలన సుమారు పదిమంది వరకు చనిపోయారని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.